దివ్యాంగుల సాధికారత అవార్డు కొరకు దరఖాస్తుల స్వీకరణ జిల్లా సంక్షేమాధికారి కె. చిన్నయ్య

Published: Friday November 18, 2022

 

మంచిర్యాల బ్యూరో, నవంబర్ 17, ప్రజాపాలన  :
 

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందించే రాష్ట్రీయ దివ్యాంగుల సాధికారత అవార్డు ప్రధానోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం ఆసక్తి గల దివ్యాంగులు, దివ్యాంగుల కొరకు పని చేస్తున్న సంస్థల నుండి ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా మహిళా, పిల్లల, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారి కె. చిన్నయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21, 22 తేదీలలో ఉదయం 8 గం||ల నుండి 10 సం॥ల నుండి 54 సం||ల వయస్సు గల వారికి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా స్థాయిలో వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఆసక్తి గల వారు జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు. ఉత్తమ ఉద్యోగి, ఉత్తమ స్వయం ఉద్యోగి, ఉత్తమ వ్యక్తిగత సామాజిక కార్యకర్త, రోల్ మోడల్, ఉత్తమ క్రీడా వ్యక్తి, సంస్థ, ఉత్తమ యజమానులుగా అవార్డు కొరకు ఆన్లైన్లో wdsc.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.మంచిర్యాల బ్యూరో, నవంబర్ 17, ప్రజాపాలన  :