ఆయాన్ష్ భార్గవ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు రక్త దాన అవగాహన సదస్సు

Published: Wednesday November 23, 2022
చౌటుప్పల్, నవంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి):చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో నీ నలంద డిగ్రీ కళాశాలలో  ఆయాన్ష్ భార్గవ్ సేవా ట్రస్ట్ చైర్మన్ మురళి బోదుల ఆధ్వర్యంలో రక్త దాన అవగాహన సదస్సు నిర్వహించారు. ర‌క్త‌దాన‌మ‌నేది ప్రాణాల‌ను కాపాడుతుంది ర‌క్తదానంపై అవ‌గాహ‌న పెంచుదాం అవ‌స‌ర‌మైన‌వారికి స‌మ‌యానికి ర‌క్తం అందుబాటులో వుండేలా చూద్దామ‌నీ ఆయాన్ష్ భార్గవ్ సేవా ట్రస్ట్ చైర్మన్ మురళి బొదుల తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నివ్య హాస్పటల్ డాక్టర్ లోకేష్ విచ్చేసి రక్తదానం ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. డాక్టర్ లోకేష్ ను కళాశాల  అధ్యాపకులు కట్టెల లింగాస్వామి శాలువాతో ఘనంగా  సన్మానించారు.అనంతరం నివ్య హాస్పిటల్ MD మల్లేష్  (మణికంఠ మెడికల్) ఇట్టి కార్యక్రమానికి ప్రోత్సాహకంగా వారి హాస్పిటల్ లో ఉచితంగా బ్లడ్ గ్రూప్ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
అనంతరం వైద్యులు లోకేష్ మాట్లాడుతూ ర‌క్తాన్ని దానం చేయ‌డంద్వారా ఇత‌రుల ప్రాణం కాపాడ‌డ‌మంటే మాన‌వాళికి సేవ చేస‌న‌ట్టేన‌ని,ఒక ఆరోగ్య‌మైన వ్య‌క్తి త‌న‌కు 65 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌చ్చేంత‌వ‌ర‌కూ ర‌క్తాన్ని దానం చేయ‌వ‌చ్చ‌ని, ప్ర‌తి మ‌నిషి మూడు నెల‌ల‌కు ఒక‌సారి అంటే సంవ‌త్స‌రానికి నాలుగు సార్లు ర‌క్త‌దానం చేయ‌వ‌చ్చ‌ని సూచించారు.
ఈ కార్యక్రమంలో చెరుకు శివ, రిజ్జూ, నాగరాజు, రాజేష్, కసిం, చరణ్, సాయి, యశ్వంత్  తదితరులు పాల్గొన్నారు.