ఉమ్మడి వరంగల్ - ఉమ్మడి ఖమ్మం జిల్లాల కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (సిసిఆర్) సంస్థ సభ్యులు మరియు

Published: Tuesday October 25, 2022

సామాజిక & అవినీతి నిర్మూలన కార్యకలాపాలు చర్చించి, తదుపరి కార్యాచరణ ప్రణాళికలు పలు కీలకమైన అంశాలపై తీర్మానాలు చేయడం జరిగింది
నర్సంపేట జిల్లా ఆసుపత్రిలో రికార్డుల పరిశీలన, మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రి రికార్డుల పరిశీలనలో లభించిన ఆధారాలతో తదుపరి చర్యలు, వరంగల్ మరియు హనుమకొండ జిల్లాల్లోని ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ బోర్డులు
మరియు ఆడియో తో కూడిన సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేయడం గురించి జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమీషనర్ లకు పిటిషన్ సమర్పణ, మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో మరియు హన్మకొండ జిల్లాలోని ధర్మసాగర్ మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఆర్టీఐ సూచన బోర్డుల ఏర్పాటు మేరకు పిటిషన్ సమర్పణ, హన్మకొండ జిల్లాలోని సుబేదారి మరియు కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోని పోలీస్ స్టేషన్ లలో రికార్డుల పరిశీలన మేరకు పిటీషన్ సమర్పణ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఆసరా పింఛన్ల వివరాల మేరకు ఆర్టీఐ దరఖాస్తుల సమర్పణ, మరియు ప్రతి ఆర్టీఐ దరఖాస్తుదారులు - ఆక్టివిస్టుల సంక్షేమం మేరకు లీగల్ సెల్ ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేసారని వారు తేలిపారు

ఈ కార్యక్రమం లో పాల్గొన్న సిసిఆర్ సంస్థ జోనల్ మరియు జిల్లా సెక్రటరీలు, సభ్యులు, వాలంటీయర్లు: నగినబోయేన రమేష్, భూక్య వెంకన్న, గొలగోపు శ్రీనివాస్, ఏ. మహేష్ కుమార్, ఎస్. వెంకటేశ్వర్లు, పి. రవి కిరణ్, కే. రాజేష్, ఈ. దేవేందర్, ఎమ్. సంబరాజు, టీ. సంతోష్, జీ. శ్రీనివాస్, ఎమ్. మురళీ, మహమ్మద్ రహీమ్ ఖాన్, డీ. రాజు యాదవ్, శంకర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు