తైక్వాండో పోటీలో బంగారు పథకాలు సాధించిన శ్రీ గాయత్రి డిగ్రీ కళాశాల విద్యార్థులు

Published: Tuesday November 29, 2022

చౌటుప్పల్ నవంబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి): నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఇంటర్ కాళోజీయేట్ టోర్నమెంట్ & ఐ యూటీ సెలక్షన్లో భాగంగా 26-11-2022 శనివారం రోజున నిర్వహించిన తైక్వాండో పోటీలో శ్రీ గాయత్రి డిగ్రీ కళాశాల విద్యార్ధులు అయిన కాసాని ప్రశాంతి బి యెస్ సి ఎం.పీ.సీ.స్ మొదటి సంవత్సరం, (ఉమెన్స్ కోటాలో ) బొడ్డుపల్లి హేమంత్ బి యెస్ సి.బి.జెడ్.సి రెండవ సంవత్సరం (మేన్స్ కోటాలో ) గోల్డ్ మెడల్ సాధించాడు. మణిక్యాల వెంకట్రావు బి.యెస్.సి ఎం.పి.సి ద్వీతీయ సంవత్సరం సిల్వర్ మెడల్ సాధించారు.దీనితో పాటు నేషనల్ కి ఎంపికైన సందర్భంగా హేమంత్ ప్రశాంతి లను శ్రీ గాయత్రి డిగ్రీ కళాశాల చైర్మన్ బండారు మయూర్ రెడ్డి, కరస్పాండెంట్ భీమిడి సుబాష్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ చెన్నగోని ఆంజనేయులు : విద్యార్ధులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ బీమిడి సుభాష్ రెడ్డి , మాట్లాడుతూ ఇలాంటి విజయాలను మరెన్నో సాధించాలని తెలియజేశారు. కోచ్ శివ సాయి, సైదులు ను అభినందించారు ఈ సందర్భంగా అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.