డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కేటాయింపు పారదర్శకంగాలేదు‌. *టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానవతా

Published: Wednesday February 22, 2023
కల్లూరు, ఫిబ్రవరి 21 (ప్రజా పాలన న్యూస్)
ఇళ్ళ కేటాయింపు లో నిరుపేదలకి తీవ్ర అన్యాయం జరిగిందని మంగళవారం కల్లూరు మెయిన్ రోడ్డు అంబేద్కర్ సెంటర్లో బాదితులతో రాస్తారోకో చేసిన మానవతారాయ్, కల్లూరు మండల కాంగ్రెస్ నేతలు.
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పక్షపాతంతో వ్యవహరించి చాలామంది అనర్హులకి ఇళ్ళు కేటాయించి  ఇల్లు వాకిలి లేని అద్దె ఇళ్ళలో నివసించే నిరుపేదలకి తీవ్ర అన్యాయం చేశారు.
96 ఇళ్ళకి 236 మంది లబ్ధిదారుల  సమక్షంలో పేర్లు రాసి లాటరీ తీయకుండా సర్పంచ్ ఇంటి దగ్గర నచ్చిన వారిపేర్లు  చిట్టీలు రాసుకొచ్చి    లాటరీ వేసి లబ్దిదారులను ఎంపిక చేయటం అనైతిక చర్య.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కేటాయింపు లో లాటరీ విధానానికి స్వస్తి పలికి రెవెన్యూ అధికారులే నిజమైన లబ్దిదారులని ఎంపిక చేయాలి.
న్యాయ  విచారణ జరిపి అనర్హులని ఏరివేసి అర్హులైన బాదితులకి  న్యాయం చేయకుంటే కాంగ్రెస్ పార్టీ తరుపున పోరాటం చేస్తాం
రేపటి నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున కల్లూరు  ఆర్డివో కార్యాలయం ముందు రిలే నిరాహారదీక్ష చేపడతామ్ అని హెచ్చరించిన మానవతారాయ్
ఈ కార్యక్రమం లో కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు ఎంపిటీసి దామాల రాజు,ఎంపిటీసి లక్కిరెడ్డి గోపిరెడ్డి,ఎస్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి భూక్య శివకుమార్ నాయక్,కల్లూరు మండల కాంగ్రెస్ మైనారిటీ నాయకులు జానీపాషా,షేక్ బాజీ,కల్లూరు మండల బిసి సెల్ మండల అధ్యక్షులు పాశం నాగేశ్వరరావు,కిసాన్ కాంగ్రెస్  మండల ప్రధాన కార్యదర్శి కర్నాటి వెంకటరెడ్డి  పాల్గొన్నారు.