మధిర మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలోమిర్చి కొనుగోలు కేంద్రం ఏర్పా

Published: Thursday February 10, 2022
మధిర ఫిబ్రవరి 9 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం పరిధిలో రూరల్ గ్రామాల్లో బుధవారం నాడు మిర్చి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన మహిళ రైతు ఉత్పత్తి దారుల కంపెని లిమిటెడ్ ఆధ్వర్యంలో మండలం పరిధిలో నిధానపురం, వంగవీడు మరియు రాయపట్నం గ్రామాల్లో తేజా మిర్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు APM రాంబాబు బీరవల్లి ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే కాలంలో అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ విషయమై అందరు రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం ప్లాంట్ లిపిడ్ కంపెనీ, కొరివి వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం మధిర మండలంలో కొనుగోలు చేసిన మిర్చిని ప్లాంట్ లిపిడ్ కంపెనీ వారికి పంపడం జరుగుతుంది. మార్కెట్ రేటు ప్రకారం గ్రామాల్లోనే కొనుగోలు చేస్తారు. దీని ద్వారా రైతులకు ఆయా గ్రామాల్లోనే మంచి రేటుకు మిర్చిని అమ్ముకోనే అవకాశం వుంటుంది. తద్వారా రవాణా చార్జీలు, ఏజెంట్లకు ఇచ్చే కమీషన్ మిగులుతుంది. దళారుల ప్రమేయం వుండదు. నాణ్యమైన మిర్చికి అధిక ధరను పొందవచ్చు. అన్ని గ్రేడ్ ల మిర్చిని కొనుగోలు చేయడం జరుగుతుంది. కావునా మండలంలోని రైతులందరూ మీకు అందుబాటులో వున్న VOA/CC లను సంప్రదించగలరు. ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి కృష్ణారెడ్డి వంగవీటి సర్పంచ్ పద్మావతి వీరారెడ్డి రైతులు పాల్గొన్నారు