తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులను కరోన ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి

Published: Wednesday May 05, 2021
మేడ్చల్ మల్కాజగిరి జిల్లా టీడబ్ల్యూజెఎఫ్
అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్
 
కూకట్ పల్లి, మే 4, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులను కారోన ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజెఎఫ్) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇప్పటికే దేశంలోని మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, పంజాబ్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టును కరోన ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాయని గుర్తుచేశారు. కరోనా పై పోరాటం లో వైద్య, పారిశుద్ధ్య, పోలీసులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించిన విధంగానే నిత్యం విధి నిర్వహణలో కరోన వార్తలను సేకరిస్తున్న జర్నలిస్టులను సైతం ఫ్రంట్ లైన్ కరోన వారియర్స్ గా గుర్తించాలని డిమాండ్ చేశారు. విధినిర్వహణలో భాగంగా జర్నలిస్టులు కరోన వార్తలను సేకరిస్తూ కరోన బారిన పడుతున్నారని అన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 26 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి మృతి చెందారని తెలిపారు. అనేకమంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారని, వీరికి ప్రభుత్వం మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కరోన తో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టును కరోన ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి ప్రత్యేకమైన వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యావపురం రవి, ట్రెజరర్ మండపాక కళ్యాణ్ చక్రవర్తి, కమిటీ సబ్యులు పాల్గొన్నారు .