నిశ్శబ్దాన్ని చేదిద్దాం, ఎయిడ్స్ గురించి చర్చిద్దాం

Published: Friday December 02, 2022
పాలేరు డిసెంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి
ఎయిడ్స్ వ్యాధి  నివారణ అందరి బాధ్యత..... ఎయిడ్స్ వ్యాధి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆలేటి పరంజ్యోతి అ న్నారు. ఎయిడ్స్ దినం సందర్భంగా ఎన్.ఎస్.ఎస్, రిబ్బన్ క్లబ్ ల సంయుక్త ఆధ్వర్యంలో నేలకొండపల్లి పట్టణంలో ప్రధాన రహదారిపై ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు నివారణ ఒక్కటే మార్గం - నిశ్శబ్దాన్ని చేదిద్దాం, ఎయిడ్స్ గురించి చర్చిద్దాం అంటూ నినాదాలు చేస్తూ  ప్లకార్డులు ధరించి ప్రజలను చైతన్య పరుస్తూ  అధ్యాపకులు,విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఆలేటి పరంజ్యోతి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి అక్రమ సంబంధాల వల్ల వ్యాధిగ్రస్తులు వాడిన సూదులు బ్లేడుల వల్ల ఇతరులకు సంక్రమించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు ఎయిడ్స్ వ్యాధి గూర్చి గ్రామీణ ప్రజలను నిరక్షరాస్యులను చైతన్యపరిచి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్  ప్రోగ్రాం అధికారి ఎస్.ఎం.రఫీ, రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ బి.కవిత, అధ్యాపకులు ఆర్ కోటమ్మ,డాక్టర్ బి నాగేశ్వరరావు, వి.వి. జానకి రామారావు, డాక్టర్ ఆర్.వెంకట రాజం, వాణి,అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.