ఎన్.ఎస్.యు.ఐ జిల్లా కార్యదర్శులుగా వడిత్యవత్ చంద్రశేఖర్ నాయక్,మణికంఠ నియామకం

Published: Monday October 17, 2022

నవాబుపేట్: ప్రజా పాలన ప్రతినిధి.16     నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్.ఎస్.యు.ఐ) రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్  మహబూబ్ నగర్ జిల్లా ఎన్.ఎస్.యు.ఐ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు,కార్యదర్శులను నియమిస్తూ ఉతర్యులు జారీ చేశారు. ఎన్.ఎస్.యు.ఐ జిల్లా కార్యదర్శులుగా నవాబుపేట్ మండలానికి చెందిన వడిత్యవత్ చంద్రశేఖర్ నాయక్,మణికంఠ లను నియమించారు.ఈ నియామక పత్రాలను జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ జహీర్ అక్తర్ చేతుల మీదుగా అందించడం జరిగింది.ఈ సందర్బంగా చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ ఎన్.ఎస్.యు.ఐ జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.నాపై నమ్మకంతో నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను సమర్థవంతంగా నేరవేరుస్తానని, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నావంతు కృషి చేస్తానని అన్నారు.ఈ నియామకానికి సహకరించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు,జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డా.మల్లురవి,డీసీసీ అధ్యక్షులు ఒబెదుల్లా కొత్వాల్, ఎన్.ఎస్.యు.ఐ జిల్లా అధ్యక్షులు అవైజ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మణికంఠ మాట్లాడుతూ తనపై  నమ్మకంతో జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన కార్యదర్శులను యం.పి.టి.సి ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీరటి రామచంద్రయ్య శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు జహీర్ అక్తర్,యం.పి.టి.సి ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీరటి రామచంద్రయ్య, రాష్ట్ర మశ్యాశాఖ రాష్ట్ర సెక్రెటరీ రాజేష్,మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శి మైనోద్ధిన్,యస్.టి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వడిత్యవత్ నీల్య నాయక్,జడ్చర్ల కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు నవాజ్ రెడ్డి,మండల కిసాన్ సెల్ అధ్యక్షులు రమేష్ గౌడ్, మండల మశ్యాశాఖ అధ్యక్షులు శ్రీహరి,మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు అజార్ అలీ,యస్.సి సెల్ మండల అధ్యక్షులు నర్సింహులు మరియు మండల  నాయకులు నర్సింహులు, శ్రీనివాసులు, పెంటయ్య,బంక శ్రీనివాసులు,తిరుపతయ్య, పోమాల్ నర్సింహులు, శ్యాముల్,ఆర్.సి పూర్ సత్యం గౌడ్ పాల్గొన్నారు.