చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపనకు ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్ దారిషెట్టి రాజేష్

Published: Monday January 09, 2023

కోరుట్ల, జనవరి 08 ( ప్రజాపాలన ప్రతినిధి ):
కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామం లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపనకు రజక సంఘ సభ్యులకు మాదాపూర్ గ్రామ సర్పంచ్ దారిషెట్టి రాజేష్ రూ. 28000/-  అక్షరాల ఇరవై ఎనిమిది వేల రూపాయలు చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టాపనకు ఆర్థిక సహాయం చేశారు.ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ చేపురి కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ గడ్డం మల్లారెడ్డి, ప్యాక్ చైర్మన్ గడ్డం ఆదిరెడ్డి, ప్యాక్ వైస్ చైర్మన్ పడాల లచ్చయ్య   మరియు రజక కుల సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రజక సంఘం సభ్యులు సర్పంచ్ దరిషెట్టి రాజేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.