బండరావిరాల సర్వే నెంబర్ 268మైనింగ్ జోన్ లో భూములు కొల్పోయిన209మంది రైతులకు నష్టరిహారం ఇవ్వకుండ

Published: Saturday August 20, 2022

ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 19ప్రజాపాలన ప్రతినిధిదీక్ష శిబిరానికి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఇ, నర్సింహ
బండ రావిరాల సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,గత 20 సంవత్సరాలుగా నష్ట పరిహారం చెల్లించాలని, అధికారులను ప్రజా ప్రతినిధులను చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన,గతంలో 16రోజులు దీక్ష చేసినసందర్బంగా స్థానిక ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు నెలల్లో ఇస్తామని వాగ్దానం చేసి సంవత్సరం గడుస్తున్న, నష్టపరిహారం ఇవ్వకపోగా, కొత్తగా కంకర మిషన్లు ఇవ్వడం కోసం ప్రజాభిప్రాయ సేకరణ పెడుతున్నారు, ప్రజా అభిప్రాయ సేకరణ కూడా స్థానికకు కాకుండా కొంతమందిని కిరాయికి తెచ్చుకొని ప్రజా అభిప్రాయ సేకరణలో నెగ్గడం కోసం స్థానిక ఎమ్మెల్యేతో సహా పెద్ద కుట్ర చేస్తున్నారు. కావున వెంటనే రైతులకు నష్టపరిహారం ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణను పెట్టాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఈ నరసింహ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో .నర్సింగరావు, మైసయ్య, నేతి కృష్ణ, పి ఐలయ్య మల్లేష్, నందు ,మధు అనేక మంది రైతులు పాల్గొన్నారు.