గ్రీన్ రీచ్ కాలనీల్లో మంచినీటి ప్రారంభించిన మేయర్

Published: Monday July 19, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన : కార్పోరేషన్ ను హరిత హారంలో భాగంగా పచ్చని వనంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహరెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్  31వ డివిజన్ లో మంచి నీటి సరఫరాని కాలనీ వాసులతో కలిసి కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా 31వ డివిజన్ లోని గ్రీన్ రిచ్ కాలనీవాసులను ఉద్దేశించి మేయర్ చిగురింత పారిజాత మాట్లాడుతూ..... కార్పొరేషన్ ను హరితహారంలో భాగంగా పచ్చని వనంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకారంతో కృషి చేస్తున్నామని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తామని తెలిపారు. వర్షాలు కురుస్తున్న తరుణంలో ఇంటిపై చేరిన నీటిని డ్రైనేజి లో కాకుండా ప్రత్యమ్నాయ పద్ధతుల ద్వారా బయటికి వదిలేలా కాలనీవాసులు, ప్రజలు చర్యలు తీసుకున్నట్లయితే కొంత డైనేజీల పాడవ్వకుండా చేయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ చిగురంత నరసింహారెడ్డి, ఏఈ బిక్కు నాయక్, కాలనీ కార్యవర్గ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.