జవహార్ నగర్ లోని బాలాజీ నగర్ ప్రధాన రహదారి 100 ఫీట్ల కోసం*.

Published: Friday February 03, 2023
జవహర్ నగర్ (ప్రజాపాలన ప్రతినిథి) : పోలవరం ప్రాజెక్టు కన్నా ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్న జవహర్ నగర్ ప్రధాన రహదారి పనులు.. బిజెపి ఎమ్మెల్యే మాదవనేని రఘునందన్ రావు గారికి విన్నవించి అసెంబ్లీలో లేవనెత్తి చర్చించడం ద్వారా పరిష్కారం చూపాలని కోరడం జరిగింది.
 
తెలంగాణ రాష్ట్ర బిజెపి మాజీ ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు శ్రీ కొంపెల్లి మోహన్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో మరియు మేడ్చల్ జిల్లా రూరల్ బిజెపి అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల విక్రమ్ రెడ్డి అన్నగారి సమక్షంలో రాష్ట్రస్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దుబ్బాక ఎమ్మెల్యే శ్రీ మాదవనేని రఘునందన్ రావు గారిని నాంపల్లిలోని రాష్ట్ర బిజెపి కార్యాలయంలో కలిసి వివరించడం జరిగింది.ఈ విషయంలో తక్షణమే స్పందించిన శ్రీ రఘునందన్ రావు గారు జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ అగస్త్యున్ అభిషేక్ గారికి ఫోన్ చేసి జవహార్ నగర్ లోని బాలాజీ నగర్ ప్రధాన రహదారి ముందుగా 100 ఫీట్లుగా తీర్మానించి పనులు ప్రారంభించనాక రోడ్డు వేయకుండా ఏవో సాకులు చెప్పి పెండింగ్ లో పెట్టి  ఇప్పుడు 55 ఫీట్లు గా మున్సిపల్ అధికారులు చెప్పుచున్నారు. అసలు 100 ఫీట్ల రోడ్డు 57 ఫీట్ల రోడ్డుగా మార్చడానికి కారణం ఏంటని వివరణ కోరడంతో పాటు దాదాపు మూడు లక్షల జనాభా కలిగిన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అను నిత్యం రద్దీగా ఉండే బాలాజీ నగర్ ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ ముందుగా ప్రకటించిన విధంగా దాదాపు 100 ఫీట్లు లేదా కనీసం 80 ఫీట్లు అయినా చేస్తే బాగుంటుందని తెలియజేశారు.
ఈవిషయంలో తక్షణమే ఉన్నత స్థాయి సమీక్ష చేసి 100 ఫీట్లతో రోడ్డు వేయాలనిజిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ అగస్త్యున్ అభిషేక్ గారిని కోరుతు. అయ్యా..! మంత్రి మల్లారెడ్డి గారూ, జవహార్ నగర్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లూ.. మీకు జవహార్ నగర్ ప్రజల పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల ఇంత చులకనా...కేవలం కిలోమీటర్ నర రోడ్డు వేయడానికి సంవత్సరాలు, నెలలు గడుస్తున్నా.. ప్రజల అవస్థలు తమకేమీ పట్టనట్లు చోద్యం చూస్తున్న అధికారులు, అధికార ప్రజా ప్రతినిధులు..!!
 
 8 సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయకపోగా అధికారంలోకి వచ్చిన నాటి నుండి 100 ఫీట్ల రోడ్డు అంటూ ప్రగల్బాలు పలికి తర్వాత 85 అంటూ చెప్పుకొచ్చారు చివరకు 55 ఫీట్లని చెబుతున్నారు. ఎవరి స్వార్థం కోసం, ఎవరి స్వలాభం కోసం అని ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.పాత రోడ్డు చాలా ఇరుకుగా ఉండడంవల్ల తగినంత పార్కింగ్ స్థలం లేక తీవ్రమైన ట్రాఫిక్ రద్దీతో పాటు ప్రయాణికులు రోడ్డు ప్రమాదాలతో నానా తంటాలు పడుతున్నారు.వెంటనే స్పందించి ప్రజల ఇబ్బందులను, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరికొత్త డ్రైనేజీ వ్యవస్థ మరియు పాదచారులకు ఫుట్ పాత్ సౌకర్యంతో ఒక స్పష్టమైన ప్రణాళికతో కనీసం 100 ఫీట్లతో రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేయాలని భారతీయ జనతా పార్టీ జవహర్ నగర్ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
లేనిపక్షంలో జవహర్ నగర్ బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి నాయకత్వంలో  సీఎం కేసీఆర్ కాన్వాయ్ ని ముట్టడి చేస్తామని మరియు త్వరలోనే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ముందు రిలే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరిస్తున్నాము.ఈ కార్యక్రమంలో జవహార్ నగర్ లోని బిజెపి మరియు వివిధ మోర్చాలలో వివిధ స్థాయిల్లో బాధ్యతలు కలిగిన నాయకులు కమల్, రామ్ నాయక్, వేపుల సన్నీ, రాఘవేంద్ర చారి, మేగావత్ రాజు నాయక్, శ్రావణ్ కుమార్ పటేల్, ముచ్చర్ల యాదగిరి, మేకల నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.