*ఎస్సి వాడలో ఉన్న స్మశానవాటికను తొలగించి న్యాయం చేయాలి* *విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డ

Published: Monday March 06, 2023
చేవెళ్ల:ప్రజాపాలన :-
చేవెళ్ల మండల పరిధిలోని దామరగిద్ద గ్రామంలో సర్వే నెంబర్ 54లో ఇళ్ల మధ్యలో ఉన్న స్మశానవాటికలో అంత్యక్రియలు జరగకుండా చూడాలని ఆదివారం దామరగిద్ద గ్రామానికి చెందిన  మాల, మాదిగ కులస్తులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎస్సి కమీషన్ మాజీ మెంబర్ చిలకమరి నర్సింహా  ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్సి వాడలో ఇళ్ల మధ్యలో ఉన్న స్మశానవాటికను తొలగించి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన వైకుంఠదామంలో అంత్యక్రియలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  గ్రామంలో ప్రతి ఒక్క కులస్తులు వైకుంఠదామంలోనే అంత్యక్రియలు చేసుకోవాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం చెప్పిన మాటలు కొందరు బిసి కులస్తులు వినకుండా ఎస్సి కాలనీలోనే అంత్యక్రియలు చేస్తామని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, మీ సమధుల ముందు  మా సమాధులు పెట్టాలా అని కులలను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సి కాలనీలో ఉన్న స్మశానవాటికను తొలగించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మాచలపల్లి రామస్వామి,బాబు జగ్జీవన్ రామ్ అధ్యక్షులు డప్పు రాజు,గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.