అక్షర చిట్ ఫండ్ లో చీటీ డబ్బులు ఇవ్వడం లేదు

Published: Monday December 12, 2022
బాధితుడు ఉద్గరే దీపక్
వికారాబాద్ బ్యూరో 11 డిసెంబర్ ప్రజా పాలన : అక్షర చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో చీటీ పాట పాడిన డబ్బులు ఇవ్వడం లేదని బాధితుడు ఉద్గరే దీపక్ ఆరోపించారు. ఆదివారం బాధితుడు ఉద్గరే దీపక్ మీడియాతో మాట్లాడుతూ అక్షర చిట్ ఫండ్ లో 3 లక్షల చిట్టి వేశానని అన్నారు. 50 నెలల చీటీకి గాను 40 నెలలు పూర్తయిన తర్వాత చీటీ పాట పాడాను. చీటీ పాట పాడిన తర్వాత నాకు 2 లక్షల 80 వేల రూపాయలు రావాలని తెలిపారు. అక్షర చిట్ ఫండ్ మేనేజర్ చీటీ పాట పాడిన డబ్బులను ఇవ్వకుండా ఫిక్స్ డ్ డిపాజిట్ చేయించాడన్నారు. మళ్లీ నా చేత 5 లక్షల చీటీ వేయమని మేనేజర్ బలవంతంగా చీటీ వేయించాడని చెప్పారు. ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన డబ్బులకు వచ్చే ఇంట్రెస్ట్ తో పాటు అదనంగా డబ్బులు కలిపి 5 లక్షల చీటీకి డబ్బులు కట్టానని వివరించారు. ఫిక్స్ డ్ డిపాజిట్ బాండ్, చీటీ డబ్బులు ఇవ్వకుండా అక్షర చిట్ఫండ్ మేనేజర్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విమర్శించారు. నేను ఇప్పటివరకు 3 లక్షల చిట్టీకు గాను 2 లక్షల 34 వేల రూపాయలు. 5 లక్షల చిట్టీకు 4 లక్షల 90 వేల రూపాయలు మొత్తం 7 లక్షల 24 వేల రూపాయలు కట్టానని తెలిపారు. అక్షర చిట్ ఫండ్ మేనేజర్ మాత్రం అన్ని ఫోను మీకు చెల్లించాల్సినవి 51 వేల రూపాయలు మాత్రమేనని చెబుతున్నాడన్నారు. లెక్కలన్నీ సరిచూసుకొని నాకు రావాల్సిన డబ్బులను అక్షర చిట్ ఫండ్ మేనేజర్ ఇవ్వాలని కోరారు.