పోషణ పక్వాడ్ కార్యక్రమంలో ఫుడ్ ప్రదర్శన పై అవగాహన గర్భిణీ స్త్రీలకు సీమంతాలు జరిపి ప్రతిజ్

Published: Thursday March 30, 2023

బోనకల్ మార్చి 29 ప్రజా పాలన ప్రతినిధి: పోషణ్ పక్వాడ్ కార్యక్రమం లో భాగం గా బుధవారం మండల కేంద్రంలో రైతు వేదిక నందు సోషల్ వెల్ఫేర్ స్కూల్ పిల్లలకు మిల్లెట్స్ వలన ఉపయోగాలు మిల్లెట్స్ తో వంటకాలు చేసి ఫుడ్ ప్రదర్శన వాటిలో ఉండే పోషకాలు పైన అవగాహన కల్పించడం జరిగింది.వెల్ బేబీ షో నిర్వహించి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. గర్భిణి స్త్రీలకు సీమంతాలు జరిపి ప్రతిజ్ఞ చేపించ నైనది. ఈ కార్యక్రమానికి డి డబ్ల్యు ఓ సంధ్యారాణి, సిడిపిఓ శారద శాంతి ,ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, బోనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ స్రవంతి , ఏపీవో బసవోజు కృష్ణకుమారి, స్నేహంజలి మండల సమైక్య ఏపిఎం పద్మలత ,ఏసీడీపీఓ కమల ప్రియ , మండల వైస్ ఎంపీపీ గుగులోతురమేష్, అంగన్వాడి సూపర్వైజర్ రమాదేవి, పలువురు ప్రజా ప్రతినిధులు స్థానిక అధికారులు, అంగన్వాడీ టీచర్లు రమాదేవి, శివ నాగేంద్ర,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.