గోవిందపురం ఏ గ్రామంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

Published: Thursday September 01, 2022
బోనకల్, ఆగస్టు 31 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందాపురం ఏ గ్రామంలో 
 సర్పంచ్ బాగం శ్రీనువాసరావు గ్రామం లో అభివృద్ధి పనులు , పారిశుద్ధ్య కార్యక్రమం ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయని తెలియజేశారు. వర్షాకాలం సమయం లో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలని బుధవారం గ్రామ పంచాయితీ సిబ్బంది తో గ్రామం లో నల్ల కనెక్షన్ తిసుకోని వాడకుండా నిరుపయోగంగా ఉన్న నీటి ఛాంబర్లను పరిశీలించారు. నీటి నిల్వ ఉన్న వాటిని గ్రామ పంచాయితీ సిబ్బంది తో నీటి తోడిచడం జరిగింది. నిల్వ ఉన్న నీటిలో దోమలు లార్వా ఉండకుండా తిమోపాస్ మందు నీటి నిల్వ ఉన్న చోట చల్లాలి అని గ్రామ పంచాయితీ సిబ్బందికి తెలియజేశారు. అలాగే గ్రామంలో రైతులు చెరువు కిందికి వెళ్ళే దారిలో కాలువ నీరు రోడ్డు మీద కు రావడం వల్ల అటు గా వెళ్లి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని సర్పంచ్ బాగం శ్రీనువాసరావుకి తెలియజేయడం తో వారి అభ్యర్థన మేరకు కావురి రమేష్ తన సొంత ఖర్చులతో జెసిబి ఏర్పాటు చేసి చర్చి దగ్గర నుంచి సుమారు రెండు వందల మీటర్ల కాలువ తీయించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఉంద్దండు, ప్రకాశరావు, గ్రామ పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.