మహానీయుల ఆశయాలను సాధిద్దాం: సిపిఐ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు డా.బిఆర్ అంబేద్కర్, బా

Published: Tuesday June 28, 2022
బోనకల్, జూన్ 27 ప్రజా పాలన ప్రతినిధి: పీడిత ప్రజల ఆశాజ్యోతి, అమరజీవి. సిపిఐ నాయకులు తూము ప్రకాష్ రావు 16వ వర్ధంతి పురస్కరించుకొని రాయన్నపేట గ్రామంలో భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంటీడ్కర్, దేశ మాజీ ప్రధాని బాబు జగ్జీవన్గావ్ మహానీయుల విగ్రహాలను మాజీ శాసనసభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు, సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరావు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. 1971 సంవత్సరంలోనే రాయన్నపేట గ్రామంలోని ప్రజలను అంబేద్కర్ అడుగుజాడల్లో నడిపించిన ఘనత ప్రకాశరావుకే ఉందన్నారు. పేదలకు, దళితులకు ఆస్తి దక్యాలన్న ఉద్దేశ్యంతో రాయన్నపేట, కలకోట గ్రామాల్లో భూమి, ఇళ్లు, ఇళ్ల స్థలాలు పంచిపెట్టిన ఘనత కమ్యూనిస్టులకే దక్కిందన్నారు. ప్రజల కోసం పాటు పడే వారిని ప్రజలు ఎప్పటికి గుర్తుంచుకుంటారని, అందుకు డా. బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ జీవితమే నిదర్శమన్నారు. తూము ప్రకాశరావు కూడా  ప్రజల అభ్యున్నతి కోసం పోరాడి సర్వస్వాన్ని త్యాగం చేశారని, అందుకే ప్రజలు 39 సంవత్సరాలుగా ఆయన వర్ధంతి ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రస్తుతం దేశం గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటుందని, చట్టసభల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రాబల్యం తగ్గడమే అందుకు కారణమన్నారు. గత ప్రభుత్వాలు ఏమి చేయలేదని, గద్దెక్కిన నరేంద్రమోడీ దేశ సంపదను బడాబాబులకు వంచి పెడుతూ పేదల పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
స్వంత ఊరికి సేవ చేయడం గొప్పవిషయం....
 
మాజీ కొత్తగూడెం శాసన సభ్యులు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూచండేని సాంబశివరావు. విద్య, వైద్య రంగాల్లో సొంత ఊరితో పాటు మండలానికి, జిల్లా కి సేవ చేయాలనే తృష్ణా కలగడం గొప్ప విషయమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేవి సాంబశివరావు కొనియాడారు. పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో అంబులెన్స్ సౌకర్యం కల్పించడం, బీపీ, షుగర్ క్యాంపు అంబులెన్స్ ను అనుసంధానించాలన్న ఉద్దేశ్యంతో బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన అంబులెన్స్ కు కూనంనేని  జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరజీవి తూము ప్రకాశరావు పేదల అభ్యున్నతి కోసం కృషి చేసి తన జీవితాన్ని త్యాగం చేస్తే అదే బాటలో ఆయన వారసులు నడవడం అభినందనీయమన్నారు. బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ వారు విద్య వైద్య రంగాల్లో చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.
 
 దళిత గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రకాశరావు భాగం, పోటు......
 
దళితులు అందరితో సమానంగా జీవించాలన్న ఉద్దేశ్యంతో 1969లో వారికి పక్కా ఇళ్లు నిర్మించాలన్న కలకోట, రాయన్న పేట గ్రామాల్లో దళితులు స్వంత ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రకాశరావు కృషి చేశారన్నారు. రాయన్నపేట తూము ప్రకాశరావు 39వ వర్ధంతి సభలో వారు మాట్లాడుతూ కలకోట చేపల చెరువును దళితులకే దక్కే విధంగా కృషి చేసినందుకే పెత్తందార్లు అతనిని హాతమార్చారన్నారు. దళితుల పక్షాన నిలిచినందుకు గానూ నేటికి దళితులు ఆయన్ను స్మరించుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. వర్ధంతి సభ అనంతరం ప్రతినెల మొదటి ఆదివారం మండల కేంద్రంలో బత్తినేని ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీపీ, షుగర్ క్యాంప్ వైద్యులు టి పవన్ కుమార్, ఎల్ గంగాధర్ గుప్తా, నిర్వాహాకులు ఆకెన పవన్, సాధనపల్లి అమర్నాధ్ ను ట్రస్ట్ ఛైర్మన్, సభ్యులు సన్మానించారు. వర్ధంతి సభకు ముందుగా కలకోటలో తూము ప్రకాశరావు, యంగల రాములుల స్మారక స్థూపాలకు పలువురు నాయకులు పూలమాలలు చేసి నివాళులర్చించారు. ఈ కార్యక్రమంలో బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ బత్తినేని నాగప్రసాదరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్, బెజవాడ రవి, సినిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు. ట్రస్ట్ సభ్యులు బత్తినేని నీరు, బత్తినేని ప్రకాష్, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, పిఎసిఎస్ చైర్మన్ కర్నాటి రాంకోటేశ్వరావు, సిపిఐ సీనియర్ నాయకులు జక్కా నాగభూషణం, మండల నాయకులు యుగం పెద్ద రమేష్, ఏలూరి పూర్ణచంద్, నాయకులు పారుపల్లి నరసింహరావు, బుర్రి నాగేశ్వరావు, బలుగూరి అచ్చయ్య, మేఘ శ్రీ హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.