1.49 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

Published: Monday February 08, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; బడంగ్ పేట్ కార్పొరేషన్ లోని  అల్మాస్ గూడా గ్రామంలో 26 వ డివిజన్ కార్పొరేటర్ రామిడి కవితా రామ్ రెడ్డి ఆధ్వర్యంలో  కోటి నలభై తొమ్మిది లక్షల వ్యయంతో అభివృద్ధికి శ్రీకారం చుట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మధుర పూరి కాలనీ, శ్రీ హిల్స్ కాలనీ, తిరుమల నగర్ యూ.జీ.డీ, బిటి రోడ్డు,  సిసి రోడ్డు అభివృద్ధి పనులకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతనరసింహారెడ్డి,డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, మున్సిపల్  అధికారులు లతో కలిసి ఆదివారం నాడు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..... చెరువులు, కుంటలు, ఖాళీ స్థలాలు , మనకు ఇచ్చిన పెద్దల ఆస్తి, ఈ ఆస్తులను భవిష్యత్తు లో మన ముఖ్యమంత్రి  పచ్చదనంగా మార్చటానికి 10 శాతం ఏర్పాటు చేయడం జరుగుతుంది.వెంకటాపురం లో ఉన్న చెరువులు, నాదర్గుల్ లో  చెరువులు గాని బాలాపూర్ లో ఉన్న చెరువులు, వాటిని సుందరీకరణ చేసి భావితరాలకు అందించే ప్రయత్నం చేయాలినీ కోరారు. కాలనీ అసోసియేషన్ వారికి ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే ఆ డివిజన్ లో ఉన్న కార్పొరేటర్లు సేవ్ చేయాలని అదేవిధంగా కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. చెరువులకు వచ్చే నీళ్లు, డ్రైనేజ్ నీరును  వేర్వేరుగా పోయేటట్లు ట్రంక్ లైన్లు పక్కా ప్రణాళికతో ఏర్పాటు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్  కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, డి ఈ అశోక్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ యాదగిరి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహా రెడ్డి , స్థానిక కార్పొరేటర్ రామిడి కవిత రామ్ రెడ్డి కార్పొరేషన్ కార్పొరేటర్లు ఏనుగు రామ్ రెడ్డి, ముత్యాల లలితా కృష్ణ, లిక్కి మమతా కృష్ణారెడ్డి, సూర్ణ గంటి అర్జున్, కార్పొరేషన్ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, చప్పిడి సంతోష్ రెడ్డి, నాగేందర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, మహిళా నాయకురాళ్లు జమున నాయుడు, కార్యకర్తలు యువకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.