భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల కార్యవర్గ సమావేశాలు

Published: Tuesday August 10, 2021
 కొడిమ్యాల, ఆగస్ట్ 09 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలలోని  చెప్యాల ఎక్స్ రోడ్డు వద్ద  భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు సురకంటి ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ తీర్మానాలుచేయడం జరిగింది. రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణ మాఫీ చేయాలి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలు చేయాలి. రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు సబ్సిడీ పైన ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎల్లంపల్లి పైప్లైన్ ద్వారా మండలంలోని పోతారం చెరువు నుండి గ్రావిటీ కాలువ ద్వారా మండలంలో అన్ని గ్రామాల చిట్ట చివరి ఆయకట్టు వరకు సాగునీరు తాగునీరు అందించాలని డిమాండ్ చేసినారు. మండలంలో అన్ని క్లస్టర్ పరిధిలోని గ్రామంలో భూసార పరీక్షలు చేయాలి. ఈరోజు పీ ఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 7.95 కోట్ల మందిరైతు ఖాతాలోకి 19.500 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. అయిన సందర్భంగా కిసాన్ మోర్చా మండల శాఖ తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు తెలిపినారు. ఏక్ బూత్ పంచ్ కిసాన్ హాదిమి అను నినాదంతో అన్ని గ్రామాల రైతులతొ రైతు చట్టాల పై అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఈకార్యక్రమంలో పాల్గొన్నవారు వడ్ల కొండ బుచ్చి రాములు, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి, రేకులపల్లి రవీందర్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు రేకులపల్లి తిరుపతిరెడ్డి, బండపల్లి సత్తయ్య, కిసాన్ మోర్చా, మండల ప్రధాన కార్యదర్శులు, బోన గాని  మల్లేశం, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు, కిషన్ మోర్చా మండల నాయకులు బాల్క రాజు, నోముల శ్రీనివాస్ రెడ్డి, గుంటకు రమేష్ రెడ్డి, కాయత అంజయ్య, గోపాల్ రెడ్డి, మొగిలి మల్లేశం, గుర్రాల సత్తిరెడ్డి, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.