పొలాలను నేతకానీల పండుగ గా గుర్తించి ప్రభుత్వం సెలవు ప్రకటించాలి : రాష్ట్ర అధ్యక్షులు జాడి న

Published: Monday September 06, 2021
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 05, ప్రజాపాలన : పొలాల పండుగును ప్రభుత్వం నేతకాని పండుగ గా గుర్తించి ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని నేతకాని మహార్ కుల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాడి నర్సయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపెట్ లో నేతకాని మహార్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గని మాట్లాడారు. అధివాసీలతో సహా ఎడుతరాలుగా నివసిస్తున్న నెతకాని మహార్ కులస్థులకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులతో సమానహక్కులు కల్పించాలని కోరారు., పొడుభూములకు హక్కుపత్రాలు ఇవ్వాలని, హైదరాబాద్ లో కులసంఘానికి  స్థలం కేటాయించి భవన నిర్మాణం చేయాలి అన్నారు. దళిత బంధు పథకం రాష్ట్ర వ్యాప్తంగా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గం అశోక్, లింగాల మల్లయ్య, దుర్గం శ్రీనివాస్, గొనె రాంచందర్ తదితరులు ఉన్నారు.