రొట్టె మీద కారం పెట్టినోన్ని సచ్చిందాక మరువొద్దు

Published: Friday January 14, 2022
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
వికారాబాద్ బ్యూరో 13 జనవరి ప్రజాపాలన : సీఎం కేసీఆర్ రాజకీయ విభేదం లేకుండా అన్ని వర్గాలకు అన్ని పార్టీల వ్యక్తులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని అందజేస్తున్నామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలలో ఏదో ఒకటి ప్రతిపక్షాలు లబ్దిపొందుతున్న సందర్భంగా రొట్టె మీద కారం పెట్టినోన్ని సచ్చిందాక మరువద్దని చమత్కరించారు. బుధవారం నవాబ్ పేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతుబంధు వారోత్సవాలను టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కందాడ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బంగారు మైసమ్మ దేవాలయం నుండి నవాబ్ పేట్ మండల కేంద్రం వరకు ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు ఊరేగింపుతో రైతుబంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ ఒకప్పుడు వ్యవసాయమే దండగన్న వారు నేడు వ్యవసాయ పురోగతిని చూసి కుళ్ళు కుంటున్నారని విమర్శించారు. వెనకటికి కొలువు ఉంటేనే పిల్లను ఇచ్చేవారని, కానీ నేటి పరిస్థితుల్లో వ్యవసాయం చేసే వాడికే పిల్లను ఇవాళ్ళని అనుకుంటున్నారని పేర్కొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాలలో పథకాలలో ఏదో ఒక పథకం ప్రతిపక్షాల ఇళ్లకు చేరుతున్నాయని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సద్విమర్శలు చేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రావుగారి వెంకట్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పోలీస్ రామ్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు మల్లారెడ్డి, నవాబ్ పేట్ కోఆప్షన్ మెంబర్ గౌస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, ఎంఏఓ ప్రసన్న లక్ష్మి, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.