దేశ ప్రధాని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి నీలం పద్మ

Published: Thursday February 10, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 8 ఫిబ్రవరి ప్రజాపాలన: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉభయ సభల్లో కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యల పట్ల యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తీవ్రంగా ఖండించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ  ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగానికి తీర్మానం చేసేటప్పుడు లోకసభ మరియు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ అధిష్టానం తీవ్రంగా ఖండించింది. వివిధ జిల్లాల నుంచినుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో యాదాద్రి- భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ మాట్లాడుతూ ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న దేశ ప్రధాని కాంగ్రెస్ పార్టీ పై ఆవిధంగా వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. అన్ని కులాలకు అతీతంగా అన్ని ప్రాంతాల ప్రజలను సమభావంతో చూస్తూ  అన్ని రాష్ట్రాల ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా వాపోయారు. జనాభా ప్రాతిపదికగా విద్యా ఉద్యోగ పారిశ్రామిక తదితర అన్ని రంగాలలో వారికి రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. దేశ 8వ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా దేశ ప్రధాని ఈ విధంగా మాట్లాడడం భావ్యం కాదన్నారు. గతంలో దేశాన్ని  ఏలిన  ప్రధాన మంత్రులు  ఏ విధంగా మాట్లాడినా రో ఒకసారి అందరు మననం  చేసుకోవాలన్నారు.