బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయం

Published: Wednesday September 01, 2021
బాలాపూర్: ఆగస్టు 31, ప్రజాపాలన న్యూస్ (ప్రతినిధి) : బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గతంలో జరిగిన విధంగానే ఈ సంవత్సరం బాలాపూర్ గణేష్ ఉత్సవాలతో పాటు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అట్టహాసంగా జరుగుతాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బాలాపూర్ గ్రామంలో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న గణేష్ మండపంలో వేదపండితులతో గజనాధుని విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాటుకు గతంలో జరిగిన విధంగానే జరుపుటకు ఉత్సవ కమిటీ వారు నిర్వహించారు. కమిటీ అధ్యక్షులు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.... మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , జిహెచ్ఎంసి మేయర్, కమిషనర్, లకు గణేష్ ప్రతిష్ట, అదేవిధంగా నిమార్జనం లను సాఫీగా జరగాలని గత వారం వారికి వివరించినమని అన్నారు. గుర్రం చెరువు కట్ట పై నిర్మాణ పనులు తొందరగా పూర్తి కావాలని, గణేష్ ఉత్సాహాలకు సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరారు. రోడ్డు కు ఇరువైపులా చెత్తను తొలగించి శుభ్రం చేయవలసిందిని సంబంధిత అధికారులను కమిటీ సభ్యులు కోరారని చెప్పారు. అదేవిధంగా ఎమ్మార్వో కార్యాలయం ముందు గణేష్ ఉత్సవ కమిటీ మండపం  దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఆ గణనాథునీ సెప్టెంబర్ 5వ తారీఖున తీసుకురావడం జరుగుతుందని ఉత్సవ కమిటీ సభ్యులందరి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, గణేష్ ఉత్సవాలు.... లడ్డు వేలం గతంలో జరిగిన విధంగానే అట్టహాసంగా జరుగుతాయని పేర్కొన్నారు.