పోషకాహారంతో మెరుగైన ఆరోగ్యం

Published: Thursday September 30, 2021
మధిర, సెప్టెంబర్ 29, ప్రజాపాలన ప్రతినిధి : అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారంతో బాలింతలకు గర్భిణీ స్త్రీలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని మధిర ఐసిడిఎస్ సిడిపిఓ శారదా శాంతి పేర్కొన్నారు. బుధవారం మధిర సెక్టర్ లోని 12వ అంగన్వాడి కేంద్రంలో మధిర సెక్టార్ వన్ అంగన్వాడీలకు మెప్మా ఆర్పిలకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిడిపిఓ శారదా శాంతి మాట్లాడుతూ బాలింతలు గర్భిణి స్త్రీలు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆహారం తీసుకోవడం వల్ల శిశువు ఆరోగ్యంగా పెరుగుతారన్నారు. ఆర్పిలు కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలకు గర్భిణీ స్త్రీలకు 6 సంవత్సరాలలోపు పిల్లలకు అందించే కార్యక్రమాలను వివరించాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ బీజానభి అంగన్వాడి టీచర్లు ఆర్పిలు పాల్గొన్నారు