రాజకీయాలకు అతీతంగా - అభివృద్దే లక్ష్యంగా రసమయి తిమ్మాపూర్ జనవరి 29 ప్రజాపాలన రిపోర్టర్ శంకరప

Published: Monday January 30, 2023

తొలిపొద్దు పర్యటనలో భాగంగా సోమవారము ఆయన వేకువ జాము నుండి గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్, చీమలకుంటపల్లి, జంగపల్లి, హన్మజిపల్లి, మాదాపూర్, గన్నేరువరం గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. ఈ సంధర్బంగా ఆయా గ్రామాలలో తమ ఇళ్ల ముందు ఎమ్మెల్యే రసమయన్న స్వాగతం అంటూ ముగ్గులు వేసి, మంగళ హారతులతో, పూల వర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలుకుతూ తమ ఆత్మీయతను చాటుకున్నారు. ఏబంధం లేకపోయినా ఒక తొడబుట్టిన అన్నలాగా ఆదరించి, స్వయంగా నాపేరుతో ముగ్గులు వేసి, మంగళ హారథులతో నాకు స్వాగతం పలికిన మీకు జీవితాంతం రుణపడి ఉంటాను తల్లులారా అంటూ చెమర్చిన కళ్ళతో ఎమ్మెల్యే రసమయి  రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయా గ్రామాల్లోని లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి ఫలాలను, సంక్షేమ పథకాలను వివరించారుప్రజల హృదయాలలో దూసుకుపోతున్న మన ఎమ్మెల్యే రసమయన్న తొలిపొద్దు పర్యటన
ఇళ్ల ముందు ముగ్గులు, మంగళ హారతులతో రసమయన్నకు ఘనస్వాగతం పలికిన ఆడబిడ్డలు
చెమర్చిన కళ్ళతో జీవితాంతం రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపిన రసమయి
రాజకీయాలకు అతీతంగా, అభివృద్దే లక్ష్యంగా ప్రతిక్షణం ప్రజాసేవలో తరిస్తున్న , రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ కి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. . ఈ సంధర్బంగా ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ రాజకేయాలకు అతీతంగా, అభివృద్దే లక్ష్యంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా ప్రతిపక్ష పార్టీలకు చెందిన గన్నేరువరం మండల బ్లాక్ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మేర రవీందర్ రెడ్డి మేన కోడలైన శ్వేతకు మంజూరైన కళ్యాణాలక్ష్మి చెక్కును సోమవారము గుండ్లపల్లిలో ఆమె ఇంటికి స్వయంగా వెళ్లి  అందజేయడమే నిలువెత్తు నిదర్శనం, నేతలకు సైతం సంక్షేమ పథకాలను అందిస్తున్న చరిత్ర కేవలం కేసీఆర్ కే దక్కిందన్నారు.