రామాపురంలో కనుల పండుగగా వన భోజన కార్యక్రమం

Published: Monday December 06, 2021
బోనకల్ డిసెంబర్ 5 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని రామాపురం గ్రామంలో గ్రామ ప్రజలు అందరూ కలిసి కులమతాలకు అతీతంగా అలనాటి రోజులను గుర్తు చేసుకునే విధంగా వన భోజనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా రామాలయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆలయ అర్చకులు గుడి చైర్మన్ పొంగులేటి కి తీర్ధ ప్రసాదాలను అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం రామాలయం అభివృద్ధిలో భాగంగా తన వంతు సహాయంగా లక్ష రూపాయల విరాళాన్ని అందజేసినారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుంకుమ అర్చన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను వనభోజనాలకు వచ్చిన గ్రామ ప్రజలను పలకరిస్తూ వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన గ్రామ సర్పంచ్ తొండపు వేణును, రామాపురం గ్రామ ప్రజలను, నిర్వాహకులను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో పొంగులేటి వెంట వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, రామాలయ చైర్మన్ బంధం అచ్చయ్య, బోనకల్ సర్పంచ్ భూక్యా సైదా నాయక్, టిఆర్ఎస్ నాయకులు ఉమ్మినేని కృష్ణ, చిన్న బీరవెల్లి పేరు శాంతయ్య, కిరణ్, సాధినేని రాంబాబు, బోయినపల్లి మురళి, గొడుగు కృష్ణ, నల్లిపోయిన కృష్ణ, బీరెల్లి వాసు ప్రదీప్, చిట్టి మోదు శ్రీను, గాదె పురుషోత్తం రెడ్డి, గుర్రం వెంకటేశ్వర్లు, గుడిపుడి రామకృష్ణ, బంధం కృష్ణ, దిద్దు బోయిన నాగయ్య, నల్లమోతు సత్యనారాయణ, గుడిపూడి వెంకటేశ్వర్లు, ఇరుగు నాగభూషణం, మామిళ్ల కృష్ణ, జువాజీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.