మధిరలో బొమ్మెర రామ్మూర్తి సుడిగాలి పర్యటన

Published: Wednesday June 16, 2021
మధిర, జూన్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ మండలం పరిధి మొదటగా మధిర మండలం మాటర్ గ్రామంలోని ఇటీవల మరణించిన నమస్తే తెలంగాణ రిపోర్టర్ రామకృష్ణ గారి తండ్రి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు తర్వాత మర్లపాడు గ్రామంలో తెరాస యువజన నాయకులు లక్ష్మారెడ్డి గారి సోదరి వివాహానికి హాజరై శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అనంతరం మడుపల్లి గ్రామం లోని ఉద్యమకారుడు నీలం నర్సయ్య గారి అకాల మరణం చెందారు, అతని కుటుంబాన్ని పరామర్శించి తన కుటుంబానికి 6వెయ్యిలు రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఆ కుటుంబానికి అన్ని వేళల అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఉద్యమకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటాను అని ఈ సందర్భంగా చెప్పారు. మధిర లో ఇటీవలే మరణించిన రిటైర్డ్ హెడ్మాస్టర్ మొండితోక ప్రేమానందం గారి చిత్రపటానికి మొండితోక సుధాకర్ గారితో కలిసి నివాళులర్పించిన బొమ్మెర రామ్మూర్తి. తెలంగాణ - ఆంధ్ర సరిహద్దుల బోర్డర్లో వాలెంటర్ సేవలు చేస్తున్న వాలంటీర్లకు మాస్కులు, శానిటైజర్ లు పంపిణీ చేసిన బొమ్మెర రామ్మూర్తి  మాటూరుపేట బోర్డర్ దగ్గర, మడిపల్లి బోర్డర్ దగ్గర, ఆత్కూరు చెక్పోస్ట్ దగ్గర డ్యూటీ నిర్వహిస్తున్న సిబ్బందికి, అలాగే మధిర టౌన్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో 100 రాంరజ్ మస్కలు, శానిటైజర్ లు పంపిణీ చేసిన బొమ్మెర రామ్మూర్తి ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నియోజకవర్గ కన్వీనర్ బొబ్బిలపాటి బాబురావు గసీనియర్ ఉద్యమకారులు గడ్డం భద్రయ్య, యువజన నాయకులు మోహన్ చైతన్య మర్లపాడు సొసైటీ వైస్ చైర్మన్ తాటి సురేష్ గారుమిణుగు చైతన్య, సతీష్ ఉపేందర్ పాల్గొన్నారు..