కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా సర్కార్ ఆసుపత్రులూ – సర్కార్ ఆస్పత్రులకు పెరుగుతున్న ప్రసవా

Published: Friday August 05, 2022

వికారాబాద్ బ్యూరో 04 ఆగస్టు ప్రజా పాలన: తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు దవాఖానల్లో వైద్య సేవ‌ల‌కు అంద‌రి ఆద‌ర‌ణ పెరుగుతుంద‌ని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కమీషనర్ డా.జే. అజయ్ కుమార్ కొనియాడారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు తాండూరులోని మాతాశిశు సంరక్షణ (ఎంసీహెచ్) ఆసుపత్రిని కమీషనర్ డా.జే. అజయ్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఆసుపత్రులు మెరుగు పడుతున్నాయన్నారు. సర్కారు దవఖానాల్లోనే అధిక‌ ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. సిజేరియన్ కంటే సాధారణ ప్రసవాలపై దృష్టిసారించడం జరుగుతుందన్నారు. కార్పోరేట్‌కు ధీటుగా అందిస్తున్న సేవ‌ల‌తో పేద‌ల‌కు వైద్యం మ‌రింత చేరువ అవుతుంద‌న్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియతో రాష్ట్రంలోని దవ‌ఖానాల్లో ఖాళీలు అన్ని భర్తీ అవుతాయని అన్నారు. కంటి వైద్యులు, పంటి వైద్యులు, ఆర్థో తదితర విభాగాల వైద్య పోస్టులు భర్తీ జరుగుతాన్నారు. దీంతో పాటు పలు ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే ఎంపీహెచ్ ఆసుపత్రిలో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. అదేవిధంగా పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో కిడ్నీ రోగులకు అందించే సేవలను విస్తరించేందుకు దృష్టిసారిస్తున్నామన్నారు. రక్తనిధి కేంద్రంలో సమస్యలను పరిష్క రిస్తామన్నారు. నిర్మాణ్ సంస్థ ద్వారా చేపడుతున్న ఐసీయూ కేంద్రాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసువ‌క‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు.