బెల్లంపల్లిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Thursday December 29, 2022

జన్నారం, డిసెంబర్ 28, ప్రజాపాలన:  కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జన్నారం మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ ఘనంగా జరుపుకున్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం కేంద్రంలో మండల అధ్యక్షులు బోర్లకుంట ప్రభుదాస్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఫసివుల్లా మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కరోనా సాకు చూపించి రాహుల్ గాంధీ గారి జోడోయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అడ్డంకులు వేసిన జోడోయాత్ర  సాగి తీరుతుందన్నారు. కులాలు, మతాల పేరిట ప్రజల మధ్యలో చిచ్చు పెడుతూ లబ్ధి పొందడానికి బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడి తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డెడికేట్ సభ్యులు జి మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులకు ముత్యం రాజన్న, పట్టణ అధ్యక్షులు దుమల రమేష్, ప్రచార కార్యదర్శి ఎం డి అజహర్, ఎస్సీ సెల్ అధ్యక్షులు మామిడిపల్లి ఇందయ్య, రహీం, గాబ్రియల్, తాజ్, యువజన కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ ముజ్జు, మంద రాజేష్, బానోత్ రోహిదాస్ ప్రశాంత్, రాహుల్, అనిల్ తదితరులు పాల్గొన్నారుజన్నారం, డిసెంబర్ 28, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా   జన్నారం మండలం చింతగూడ శ్రీ లక్ష్మీదేవి ఆలయ కమిటీ పాలకమండలి అధ్యక్షునిగా స్థానిక గ్రామానికి చెందిన బీర్పూర్ మల్లేష్ ను ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అజ్మీర రేఖానాయక్ బుధవారం  నియమించి వారికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలయ కమిటీ చైర్మన్ శాలువ కప్పి సన్మానించారు. అదేవిధంగా స్థానిక ఆలయ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ  స్థానిక గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీదేవి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి చైర్మన్, కమిటీ సభ్యుల వంతు సహకారం అందించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజారాం రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, ఎంపీపీ వైస్ చైర్మన్ సుతారి వినయ్ కుమార్, మండల పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.