ఉమ్మినేని లక్ష్మీనారాయణ సేవలు మరువలేనివి: గోవిందపురం (ఎల్) గ్రామ సిపిఎం పార్టీ నాయకులు

Published: Wednesday February 09, 2022
బోనకల్ ఫిబ్రవరి 8 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధి లోని గోవిందాపురం ఎల్ గ్రామంలో సిపిఎం పార్టీ గ్రామకమిటీ ఆధ్వర్యంలో ఉమ్మినేని లక్ష్మీనారాయణ సంతాపసభ నిర్వయించడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ సిపిఎం పార్టీ లో ప్రజా సమస్యలపై కీలక పాత్ర పోషించిన నాయకుడు ఉమ్మినేని లక్ష్మీనారాయణ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామ కమిటీ కార్యదర్శి ఉమ్మనేని రవి, సీపీఎం సీనియర్ నాయకులు మాధినేని నారాయణ, సిపిఎం నాయకులు వై లక్ష్మణ్ రావు, మాధినేని వీరభద్రరావు, కోట కాటయ్య, జె.సునీత, ఎన్ వాని, కె చంద్రయ్య, బుచ్చయ్య, జానకిరామయ్య, కళ్యాణాపు శ్రీను, స్వరూప, బస్వమ్మ, నాగేంద్రమ్మ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.