విస్లవత్ లక్ష్మీని ఆదుకున్న దాతలు

Published: Friday June 18, 2021
పరిగి 17 జూన్ ప్రజా పాలన ప్రతినిధి : ధాతలు ఆదుకోవడం సంతోషంగా ఉందని లక్ష్మి అన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని దిర్సoపల్లి తండా కి చెందిన విస్లవత్ లక్ష్మీ సమస్యని వెలుగు లోకి తీసుకురావడం తో ఆమెకు సహాయం చేయటానికి దాతలు ముందుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే కుల్కచర్ల కు చెందిన వాజీద్ అలాగే దోమ నివాసి అడ్వాకేట్ ఉమర్ అలాగే దిర్సoపల్లి తండా నివాసి కమర్షియల్ సీనియర్ అసిస్టెంట్ పాండు నాయక్, అలాగే బడేంపల్లి అంబెద్కర్ యువజన సంఘం కలిసి విస్లవత్ లక్ష్మీ ని బ్యాటరీ తో నడిచే వీల్ సైకిల్ ని అందచేశారు. ఆమెతో పాటు బడేంపల్లి గ్రామంలో గల మరో ఇద్దరికి వీల్ చైర్ ని అందచేశారు. దోమ కి చెందిన అడ్వాకేట్ ఉమర్ విస్లవత్ లక్ష్మీకి నిత్యావసర సరుకులు కుడా తమ వంతు సహాయంగా అందచేశారు. ఈ సందర్బంగా దాతలు మాట్లాడుతూ పత్రికలలో, ఛానల్ లో వచ్చిన ఈ వార్త ని చూసి చలించి ముందుకు వచ్చాం ముందు ముందు మరిన్ని సేవ కార్యక్రమ లకు మేము సిద్ధంగా ఉంటామని పత్రికా ప్రకటనలు పేర్కొన్నారు. అలాగే అంబేద్కర్ యువజన సంఘం పరిగి తాలూకా ఉపాధ్యక్షులు జోగు భాస్కర్ మాట్లాడుతూ దాతలు ఒకే సారి ముగ్గురికి సహాయo చేసి మానవత్వం చాటుకున్నారని కొనియాడారు. అనంతరం ధాతల్ని తన తరుపు నుండి సన్మానించారు. ఈ కార్యక్రమంలో దాతలతో పాటు దిర్సo పల్లి తండా సర్పంచ్ వెంకట్ రాములు, ఉపసర్పంచ్ మోతిలాల్ అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షుడు అంజి, అలాగే హరిక్రిష్ణ, జోగు భాస్కర్,  గ్రామస్థులు పాల్గొన్నారు.