టకారియ నగర్ లోని ప్రభుత్వ భూములను కాపాడండి తెలంగాణ రాష్ట్ర చీఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అ

Published: Thursday June 30, 2022
బెల్లంపల్లి జూన్ 29 ఇది ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణంలోని బాలాజీ థియేటర్ను ఆనుకొని ఉన్న టకారియ నగర్ మొత్తం 170 పిపిలోని ప్రభుత్వ స్థలమని, అట్టి స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టి కోట్లాది రూపాయలకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు అమ్ముకుంటున్నారని, అలాంటి దళారుల చేతుల్లో నుండి ప్రభుత్వ భూమిని కాపాడాలని, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గెల్లి జయరామ్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అధికారికి పంపిన విజ్ఞాపన పత్రం లో ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 
మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో గల బాలాజి థియేటర్ వెనక భాగం టకారియ నగర్ లో 170 పి పి లోని  ప్రభుత్వ స్థలంలొ అక్రమ నిర్మాణాలు చేపట్టి కోట్లాది రూపాయలకు, అమ్ముకుంటున్నారని, ఈ అక్రమ నిర్మాణాల్ని గతంలో రెవెన్యూ అధికారులు రెండు సార్లు తొలగించారని.ఈ స్థలం కోర్ట్ వివాదం లో ఉన్నా.కబ్జా దారులు ఈ స్థలానికి పట్టా ఉన్నదని, ధరణి వెబ్సైట్ లో కుడా ఉన్నదని మాగంటి రాంచందర్ రావు పేరు చెప్పుకొని కొందరు దళారులు ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తూ, కోట్లు గడించాలని దుర్మార్గమైన  కుట్రలు పన్ను తున్నారని. వీరికి స్తానిక అవినీతి  రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారని,
కావున  సమగ్ర విచారణ జరిపి ఈ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.