బోర్నపెల్లి గోదావరి ఒడ్డున ఉన్న కుర్రు (ఐలాండ్) లో చిక్కుకున్న రైతులు

Published: Wednesday July 13, 2022
సంఘటన స్థలానికి వెళ్లిన జిల్లా కలెక్టర్ శ్రీ రవి మరియు జగిత్యాల శాసనసభ్యులు శ్రీ సంజయ్ కుమార్
 
 రాయికల్, జూలై 12( ప్రజా పాలన ప్రతినిధి):
 రాయికల్ మండలం బోర్నపెల్లి గ్రామానికి చెందిన తొమ్మిది మంది రైతులు కుర్రు "ఐలాండ్" లో వ్యవసాయ పనుల నిమిత్తం పత్తి నాటేందుకు వెళ్లి ఈ ప్రాంతంలో చిక్కుకున్నారు వీరు గత పది రోజుల నుండి అక్కడే పని చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటున్నారు గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ప్రవాహ ఉధృతి పెరగడంతో అక్కడే చిక్కుకున్నారు వీరిని కాపాడడానికి ప్రభుత్వం ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను పంపిస్తున్నట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు తెలిపారు అవసరమైతే హెలిప్యాడ్ ను కూడా పంపిస్తామని తెలిపారు ఈ విషయాన్ని తెలుసుకున్న జగిత్యాల శాసనసభ్యులు శ్రీ  సంజయ్ కుమార్ గారు, మరియు జిల్లా కలెక్టర్ రవి గారు, మరియు జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ గారు డిఎస్పి ప్రకాష్ గారు సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ప్రత్యేకంగా వీక్షిస్తున్నారు