ఈడి విచారణ పేరు తో బి జె పి అధికార దుర్వినియోగం

Published: Tuesday June 21, 2022
మంచిర్యాల టౌన్, జూన్ 20, ప్రజాపాలన : ఈడి విచారణ పేరు తో బి జె పి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని,  కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా, రాహుల్ గాంధీలను వేధించే విధానాలను విడనాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది . ఈ మేరకు సోమవారం ఐబీ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి , మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, మాట్లాడుతూ సోనియా గాంధీ ,రాహుల్ గాంధీలను ఈడి విచారణ పేరుతో వేధించడం శోచనీయమని కాంగ్రెస్ నేతలు అన్నారు . దేశంలో కాంగ్రెస్ పార్టీ వేగంగా విస్తరిస్తుండడంతో ఓర్వలేని  బిజెపి ప్రభుత్వం విచారణల పేరుతో వేధింపులకు పాల్పడుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ,  సిబిఐ లను అడ్డం పెట్టుకుని  వేదింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో , ఒ బి సి సెల్ జిల్లా చైర్మన్ వడ్డే రాజమౌళి,మహిళ పట్టణ అధ్యక్షురాలు గజ్జెల హేమలత, మహిళ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లవి,మహిళ పట్టణ ఉపాధ్యక్షురాలు శైలజ,ఆది శశి కళ,యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు షేర్ పవన్, పెంట రమేష్, బోల్లం భీమయ్య,దోమల రమేష్,  స్వామి,తిరుపతి, తజమ్ముల్, ఖదిర్,మోహన్ రెడ్డి,రఫీ,సత్యం,వేముల రమేష్, ఫర్వేజ్,రాజన్న, రామస్వామి, షకీల్, ప్రకాష్ , లక్ష్మణ్, కుమార్,రాజ్ కుమార్,అజయ్, తదితరులు పాల్గొన్నారు