ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 2ప్రజాపాలన ప్రతినిధి ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 2ప్రజాపాలన ప్రతినిధ

Published: Friday March 03, 2023

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని యాచారం మండలంలోనీ పలు గ్రామాల ప్రజలతో మాయమాటలు చెప్పి కేపీడబ్ల్యు, ఈస్టోర్ ఇండియా  అనే కంపెనీ పేరుతో సుఫియాన్  అనే వ్యక్తి వారి సోదరులతో కలిసి పేద ప్రజలను నమ్మించి మోసగించి కోట్ల రూపాయలు 36 నెలలకు డిపాజిట్ చేయించుకుని ఒక లక్షకు నెలకు 9000 రూపాయలు వడ్డీగా ఇస్తానని నమ్మబలికి మూడు నెలలు డబ్బులు బాధితులకుచెల్లించగా నమ్మిన వివిధ గ్రామాల ప్రజలు లక్షల్లో డబ్బులు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టడం జరిగింది. మూడు నెలల వరకు ఈ యొక్క డబ్బులకు త్వరగా రెట్టింపు డబ్బులు ఇస్తుండడంతో బాధితులు  బంగారం, భూములను కుదువపెట్టి చాలామంది కంపనిలోపెట్టుబడి పెట్టి మోసపోయారు. మోసపోయిన బాధితుల్లో కొంతమంది ఎండి ముక్తార్ 7లక్షలు, గౌసియబెగం 20లక్షలు.  రాము 18లక్షలు, ఎండి మహ్మద్ 25లక్ష లు,మహ్మద్ వలి 15లక్షలు, మస్కు శ్రీశైలం 6లక్షలు, ఎం డి అక్తర్ 20లక్షలు, మహమ్మద్ 6. 50 లక్షలు రూపాయలు పెట్టుబడులు పెట్టి దానికి ఎలాంటి రసీదులు లేకుండా ఫోన్ పే, గూగుల్ పేలలో మాత్రమే డబ్బులు వేయించుకొని, కంపెనీ అకౌంట్ చూపించకుండా సొంత అకౌంట్ లోకి వేసుకొని మోసం చేయడం జరిగిందని బాధితులు వాపోతున్నారు. దాదాపు 35కోట్లు మోసం చేసిన పాకిస్థాన్ కు చెందిన కేపిడబ్ల్యు,కృప్తో కంపెనీ ముసుగులో ఎండి సుఫియాన్, ఉమ్నన్,,సల్మాన్, సమద్, వహీద్,యూనూస్,అజార్, ప్రజలను మభ్యపెట్టి ఇక్కడో పాకిస్తాన్ సంస్థల పేర్లు చెప్పి ఎటువంటి ఆధారాలు లేకుండా పేద ప్రజల వద్ద నుండి కోట్ల రూపాయలు కొల్లగొట్టి మొఖం చాటగా తెలుసుకున్న బాధితులు ఇంటి వద్దకు వెళ్లి నిలదీయగా మా దగ్గర డబ్బులు లేవని ఏమి చేసుకుంటారో చేసుకోండి అని తెగేసి చెప్తున్నారు. ఇట్టి మోసాలకు పాల్పడిన సుహాన్ తో పాటు అతని సోదరులను వెంటనే కస్టడీలోకి తీసుకొని విచారించి మేము కోల్పోయిన డబ్బును ఇప్పించాలని సుమారు 50 మంది బాధితులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించి పూర్తి వివరాలు సి ఐ లింగయ్యకు ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితులు పాల్గొన్నారు.