జల్లా కృష్ణ రాకేష్ పుట్టినరోజు సందర్భంగా అనాధ ఆశ్రమాలలో అనాధలకు అన్నదానం

Published: Monday May 16, 2022
 మధిర మే 14 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు సేవాసమితి ఆధ్వర్యంలో
 చిరంజీవి జల్లా నాగరాజు  కుమారుడు చిరంజీవి జల్లా కృష్ణ రాకేష్ "పుట్టినరోజు సందర్భంగా" డాక్టర్ వసంతమ్మ  సేవా సదనం ఆశ్రమం నందు మరియు ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంల నందు వికలాంగులకు మతిస్థిమితం లేని వారికి వృద్ధులకు అన్నదానం చేసినారుఈ కార్యక్రమం ఖమ్మం జిల్లా వాసవి చిరు వ్యాపారుల సంఘం  అధ్యక్షులు మిట్టపల్లి రవి  చేత ప్రారంభించినారు ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంక్షేమ రాష్ట్ర కన్వీనర్ పల్లపోతు ప్రసాదరావు మాట్లాడుతూ మధిర నివాసులు ఎక్కడ నివసిస్తున్న సొంత గ్రామం మమకారం మీద ఇక్కడ గుర్తుంచుకొని వికలాంగులకు  మా ద్వారా సహాయ సహకారాలతో సేవ చేయటం చాలా గొప్ప విషయమని తెలుపుతూ చిరంజీవికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోమటిడి శ్రీనివాసరావు మిర్యాలకాశీ విశ్వేశ్వరరావు, చారుగుండ్ల లక్ష్మీ నరసింహ మూర్తి,యర్రా లక్ష్మణ్, జల్లా రాధాకృష్ణ, నాళ్ళ విజయ్ కుమార్, ఖమ్మం జిల్లా వాసవి చిరు వ్యాపారుల సంఘం మహిళా అధ్యక్షురాలు కనికిచర్ల రజిని, సెక్రటరీ కనకచర్ల లక్ష్మణ నగేష్, ఎస్కే సైదా పాల్గొన్నారు