16వ డివిజన్ లో టిఆర్ఎస్ పార్టీ కమిటీ ఎన్నిక

Published: Monday September 13, 2021
బాలాపూర్, సెప్టెంబర్12, ప్రజాపాలన ప్రతినిధి : స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మహేశ్వరం నియొజకవర్గం టిఆర్ఎస్ పార్టీఅధ్యక్షులు & ఇంచార్జి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీని 16వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకోవడం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ.... తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సబితమ్మ ఆదేశాల మేరకు నా డివిజన్లో పార్టీ కార్యకర్తలతో పాటు క్రియాశీల నాయకులు హాజరై, ప్రతి ఒక్కరు ఆమోదం తెలిపిన తర్వాత డివిజన్ టిఆర్ఎస్ కమిటీ లిస్టు ను కార్పొరేషన్ ఇంచార్జి ఫ్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి కి అందజేశానని ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.