ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 31 ప్రజాపాలన ప్రతినిధి *యాచారం మండలం పాదయాత్ర ముగించుకుని మంచాల మండల

Published: Wednesday February 01, 2023

ప్రగతి నివేదన యాత్ర  యాచారం మండలం  నంది వనపర్తి నుండి 22 తేదీన ప్రారంభమైన ప్రగతి నివేదిక యాత్ర ఈరోజుకు పదవ రోజుకు చేరుకొని 31 గ్రామాలు149 కిలోమీటర్లు  వరకు పూర్తిచేసుకుని యాచారం మండల పరిధిలోని గ్రామాలు తిరిగి సమస్యలు పరిష్కరించుకొని. యాచారం మండలం అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని ప్రశాంత్ రెడ్డి అన్నారు.. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎన్నో నిధులు తెచ్చి అభివృద్ధి బాటలో ఎమ్మెల్యే సహకారంతో   పూర్తి చేస్తామని మరిన్ని నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. గున్గల్  గ్రామంలో వీధి వీధి తిరుగుతూ సమస్యలు తెలుసుకుని ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని సీఎం ఎన్నో సంక్షేమ పథకాలు అందించి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కిట్టు సీఎం రిలీఫ్ రైతుబంధు దళిత బంధు ఇంకెన్నో మరెన్నో పథకాలు అందించి తెలంగాణ రాష్ట్ర సస్యశ్యామలంగా ఉండాలని ఆయన కోరారు. అదేవిధంగా గున్ గల్ గ్రామానికి మార్కెట్ భవనానికి రెండు లక్షల రూపాయలు ఇచ్చామని ఏకలవ్య కుమ్మరి సంగం భవనాలకు2 లక్షలు మంజూరు చేయించామని ఆయన తెలిపారు. అన్ని గ్రామాలు నాకు సహకరించి నాతో పాదయాత్రలో పాల్గొన్న మిత్రులందరికీ మీడియా మిత్రులకు ఎప్పటికప్పుడు వార్తలు సేకరిస్తూ సమాజం వైపు నన్ను మళ్లించిన వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మనీ అన్నారు. యాచారం మండలం పాదయాత్ర పూర్తి చేసుకుని  మంచాల మండలానికి అడుగేస్తున్న  ఈ కార్యక్రమంలో యాచారం మండలం జెడ్పిటిసి చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య, యాచారం, మండల అధ్యక్షులు కర్నాటి రమేష్ గౌడ్, బంటి ఫోర్స్ బిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.