అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ డైరీ, క్యాలెండర్ లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

Published: Thursday February 23, 2023
కోరుట్ల, ఫిబ్రవరి 22 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణంలోని కేదార్ గార్డెన్ లో బుధవారం రోజున అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా కమిటీ అధ్వర్యంలో అఖిల భారతీయ జర్నలిస్ట్ ఫెడరేషన్ క్యాలెండర్‌, డైరీలను జగిత్యాల జిల్లా బి.అర్.ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ జర్నలిస్ట్ సమస్యలకు,సంక్షేమానికి జర్నలిస్ట్ సంఘాలు ఎంతో అవసరం అని, జర్నలిస్టుల సంక్షేమానికి  తన వంతు  కృషి చేస్తానని ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ.బి.జె.ఎఫ్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ముస్సవీర్, జగిత్యాల జిల్లా ఏ.బి.జే.ఎఫ్ అధ్యక్షులు ఇంధ్రాల హరీష్ ,జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు కాశిరెడ్డి వెంకటరెడ్డి , ఏ.బి.జే.ఎఫ్ కోరుట్ల డివిజన్ అధ్యక్షులు వనతడుపుల మహాతేజ,సభ్యులు బైరి సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.