డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భావ జలాన్ని ప్రజల్లో పెంపొందించడమే ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం

Published: Monday February 27, 2023
తిమ్మాపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఆదివారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో మండల అద్యక్షుడు పారునంధి జలపతి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న దళిత బంధువులను కలిసి ప్రతి ఇంటికి వెళ్లి వారితో మమేకమై  ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాలలో ఎన్నో గొప్ప గొప్ప చదువుకొని ప్రజాస్వాయ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగం రాసిన గొప్ప వ్యక్తి, మహనీయుడు అంబేద్కర్ అని, ఆ మహనీయుని సిద్ధాంతాలను, సమాజ కోసం అతను పడిన కష్టాలను, అయన చేసిన గొప్ప పనులను  వివరిస్తూ ఆ మహనీయుని పట్ల తన వంతుగా ముందుండి వారి ఆకాంక్షను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అయన అన్నారు. అంతేకాకుండా దేశంలో కొంత మంది మనువాదులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం జరుగుతుందని, అందువలన కుట్రలను నిర్వీర్యం చేయడానికి మనమందరం ఏకమై దాన్ని అడ్డుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాలను అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోయాడ మురళి, మండల ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, నియోజక వర్గ అధ్యక్షులు గంగిపల్లి సంపత్, మండల గౌరవ అధ్యక్షులు బొర్రా రవీందర్, ఉపాధ్యక్షులు తాళ్లపల్లి నందకిషోర్, నాయకులు మేకల సునీల్ , గ్రామ అంబేద్కర్ సంఘం నాయకులు ఎలుకపెల్లి నరసయ్య, ఖమ్మం శంకరయ్య, ఎలుక పెళ్లి ఆంజనేయులు, కిన్నెర అంజయ్య , కనుకం సంపత్, కనుకం ఆంజనేయులు, కనుకం వీరయ్యా తదితరులు పాల్గొన్నారు.