నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు అందని విధంగా బి జె ఆర్

Published: Tuesday June 01, 2021

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పాలన ప్రతినిధి : భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం గత ఏడు సంవత్సరాలలో పెట్రోల్, డీజిల్, వంట నూనె మరియు నిత్యవసర సరుకులు పేద ప్రజలకు అందని విధంగా ధరలు పెంచినందుకా భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. బి జె ఆర్ భువనగిరి జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారతదేశ చరిత్రలో ఎప్పడు లేని విధంగా పెట్రోల్ డీజిల్  వంట నూనె నిత్యావసర సరుకులు పేద మధ్య తరగతి ప్రజలు కొనలేని పరిస్థితికి తీసుకొచ్చిన నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు చేసుకోవడం నిరసిస్తూ హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద మోటార్ సైకిళ్లకు ఆటోలకు తాడు కట్టి లాగుతూ నిరసన తెలియజేసిన కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పేద ప్రజలకు కరోనా బారిన పడ్డ కుటుంబాలను ఆదుకోవాలని అటువంటి భారతీయ జనతాపార్టీ నాయకులు సంబరాలు జరుపుకోవడం శోచనీయం ఏడు సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలనలో పేద ప్రజల కానీ సామాన్య గాని మధ్యతరగతి ప్రజానీకానికి ఎలాంటి లాభం చెయ్యక కేవలం కొంతమంది కార్పొరేట్ వ్యవస్థలకు భారత ఆర్థిక వ్యవస్థను కట్టబెట్టటం నిరసిస్తూ అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగిన ప్రతిరోజు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ దిన దిన వంద రూపాయలు పెట్రోల్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. డీజిల్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు, గ్యాస్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు, వంట నూనె రేట్లు పెంచుకుంటూ పోతున్నారు, నిత్యావసరాల రేట్లు పెంచుకుంటూ పోతున్నారు, ఆర్ధిక వ్యవస్థని నాశనం చేసుకుంటూ పోతున్నారు. నిరుద్యోగాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఎన్నడూ లేనివిదంగా రామరాజ్యంలొ దేశంలొ రైతుల ఆత్మహత్యలు లక్షకు పైగా పెరిగారు, దేశంలొ అమ్మాయిల పై అత్యాచారాల, ఘోరాలు రెట్టింపు అయ్యాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని అమ్ముకుంటూ పోతున్నారు, ఒబిసిల ప్రతేక్య నిదులు నిలిపివేశారు. ఎయిర్పోర్ట్లు, షిప్ పోర్ట్ లు అమ్ముతున్నారు. రైళ్లను, రైల్వే స్టేషన్లను అమ్ముతున్నారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాడికి జీతాలు పెరగట్లేదు కూలి పని చేసేవాడికి పని దొరకట్లేదు కరోనా లాక్ డౌన్ లో అదానీ సంపద 750 % పెరిగింది.అంబానీ సంపద 350 % పెరిగింది. కానీ దేశ సంపద మాత్రం -23 (మైనస్ 23) కి పడిపోయింది, విపత్కర సమయంలో వలస కూలీల కు కడుపేద కూలీలకు రేషన్ కార్డు ఉన్న లేనటువంటి వాళ్లకు నిత్యావసర సరుకులు రోజు కూలీ చేసుకునే పేదవారికి ఇంటికి 7500 రూపాయలు అదేవిధంగా కరోనా బారిన పడి లో చనిపోయిన కుటుంబ పిల్లలను తక్షణమే ప్రత్యక్షంగా ఆదుకునేది భారతీయ జనతా పార్టీ ఏడు సంవత్సరాల సంబరాలు జరుపుకోవడం ప్రజలను అవమానించడమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పడిగెల ప్రదీప్ యూత్ కాంగ్రెస్ నాయకులు బట్టు మహేందర్, కసరబోయిన సాయి కుమార్, గాయపాక వెంకటేష్, ఎండి కబీర్, బర్రె మహేందర్, ఎండి ఫయాజ్, గుడ్డేనకి ప్రమోద్, మధు బాబు, ఇటుకల మహేష్ తదితరులు పాల్గొన్నారు.