సత్యంకు జడ్పీటీసీ ప్రమీల, సర్పంచ్ లక్ష్మీనారాయణ నివాళులు..

Published: Tuesday February 28, 2023
తల్లాడ, ఫిబ్రవరి 27 (ప్రజా పాలన న్యూస్): 
తల్లాడ మండలంలోని బస్వాపురం గ్రామానికి చెందిన పాశం సత్యం దశదిన ఖర్మ సోమవారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తల్లాడ జడ్పిటిసి దిరిశాల ప్రమీల, గ్రామ సర్పంచ్ సూరంపల్లి లక్ష్మీనారాయణ హాజరై పాశం సత్యం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో బీఆర్ఎస్ జోనల్ చైర్మన్ దిరిశాల దాసురావు, పార్టీ గ్రామ కార్యదర్శి పేటూరి నరసింహారావు, బీసీ నాయకులు పాశం నారాయణ ఉన్నారు.