ఘనంగా ప్రపంచ వికలాంగుల దినోత్సవం వేడుకలు

Published: Thursday December 29, 2022
మేడ్చల్ (ప్రజాపాలన ప్రతినిథి):  జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధి డెంటల్ కాలేజ్ దగ్గరి సిపిఐ కాలనీ కమిటీ హాల్ లో ప్రపంచ వికలాంగుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 
వికలాంగులు ఎదురుకుంటునటువంటి సమస్యలను వివరిస్తూ వాటిని పరిష్కారించే మార్గాలను, సూచనలను తెలియజేస్తూ ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. 2016 వికలాంగుల చట్టంపై అందరికీ అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ  సంక్షేమ పథకాలు ప్రతి వికలాంగుడికి చేరే విధంగా కృషిచేయాల్నారు. వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అలాగే డబుల్ బెడ్ రూమ్ కూడా 5% తక్షణమే అమలు చేయాలని, దళిత బందులో కూడా 5% రిజర్వేషన్ చేయాలని వికలాంగులు కూడా సకలాంగులతో సమానమని భావించి అన్ని రంగాల్లో ముందుండాలని తెలిపారు. వికలాంగుల సామాజిక ఆర్జిక జీవన స్థితిగతులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్వయం ఉపాధి లోన్లు సమస్యలపై పోరాటం చేస్తూనే వుంటాం అని అన్నారు. ప్రతి సంవత్సరం వికలాంగుల దినోత్సవం వికలాంగులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు 18 డివిజన్ కార్పొరేటర్  శాంతి కోటేష్ గౌడ్, 19వ డివిజన్ మేకల లలిత యాదవ్, కో ఆప్షన్ మెంబర్ శోభా రెడ్డి, టి ఎస్ ఎల్ ప్రెసిడెంట్ మన స్నేహం NS  గ్రూప్ ఫౌండర్ చైర్మన్ ఎస్ కావేరి, ధర్మేంద్ర కుమార్, రేగల సతీష్ రెడ్డి, సైమల అయ్యప్ప దేవాలయ సొసైటీ చైర్మన్ కుడికాల లక్ష్మీ, నరసయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రేమ్ కిషోర్, తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తికొండ కిరణ్ కుమార్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గోధ సంపత్ కుమార్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మెరుగు శివకృష్ణ, ముత్తు గీతాంజలి, రియాన్ ఇంటర్నేషనల్ ఉమెన్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ ఎంపీడీవో నేషనల్ ప్రెసిడెంట్ నల్గొండ శ్రీనివాసులు, కళాజ్యోతి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు  మోత రాజేశ్వరి, 18వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, వెంకటలక్ష్మి, ప్రమీల, అప్పారావు, రాజు, రంజిత్, రాజేందర్, బబ్లు, వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు