మెడిసిన్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రమ్య

Published: Thursday November 03, 2022

బోనకల్, నవంబర్ 3 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రాయన్నపేట గ్రామానికి చెందిన తోటపల్లి రమ్య 2022 నీట్ పరీక్షల్లో 465 మార్కులు సాధించి ఎంబిబిఎస్ కి అర్హత సాధించింది. మొదటి కౌన్సిలింగ్ లో మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించింది.రమ్య ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాల రాయనపేట లో చదివి, తర్వాత అళ్ళపాడు గ్రామంలో కూరాకుల వెంకయ్య మెమోరియల్ (ఐ ఎఫ్ ఎస్) జడ్పీఎస్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివింది.పదో తరగతి లో 9.2 మార్కులు సాధించింది. తరువాత టి ఎస్ ఆర్ జె సి వైరాలో ఇంటర్మీడియట్ చదివింది. ఇంటర్మీడియట్లో 972 మార్కులు సాధించింది,ఆమె తల్లిదండ్రుల కష్ట ఫలితంగా 2022 లో ఎంబీబీఎస్ సీటు సాధించి తల్లిదండ్రులని సంతృప్తిపరిచినది. పేద కుటుంబం అయినప్పటికీ పట్టుదలతో చదివి మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ సాధించటం ఎంతో సంతోషకరం అని తోటపల్లి రమ్యా ను ఆదర్శంగా తీసుకొని మండల లోని దళిత విద్యార్థులు మరింత ముందుకు వెళ్లి చదువులో ఉన్నత శిఖరాల్లో ఎదగాలని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు పార్టీల నాయకులు , ఎమ్మార్పీఎస్ నాయకులు కోట కొండ, కోట హనుమంతరావు, తోటపల్లి సైదులు,తాటికొండ వెంకటరత్నం, వేల్పుల పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.