ప్రజాగొంతుకలను అరెస్టు చేసి, మంత్రులు పర్యటనలు చేయడం సిగ్గుచేటు* *సిపిఐ జిల్లా కార్యవర్గ సభ

Published: Thursday February 23, 2023

చేవెళ్ల ఫిబ్రవరి 22, (ప్రజాపాలన):- రంగారెడ్డి జిల్లా  చేవెళ్ల నియోజకవర్గం  షాబాద్  మండలం హైతాబాద్ చందనవెలి. మాచన్ పల్లి  గ్రామాలలో 
రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఇతర మంత్రులు పర్యటించాలంటే అర్ధరాత్రి నాయకులను అరెస్టు చేయాలా అని ప్రజలను చూసి ప్రభుత్వాలు భయపడుతున్నాయా అని ఆయన మంత్రులను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కే రామస్వామి ప్రశ్నించారు.
అరెస్టులు చేసే పర్యటించాల్సిన దుస్థితి మంత్రులకు పట్టిందంటే వారు చేస్తున్న అభివృద్ధి పనుల మీద వారికే నమ్మకం పోయిందని ఆయన విమర్శించారు.
ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇతర హామీలను అమలు చేసి ప్రభుత్వం తన మాటను నిల్చుకోవాలని రామస్వామి డిమాండ్ చేశాడు
చందన్ వెళ్లి ఏరియాలో నిర్మితమవుతున్న పరిశ్రమలకు ప్రభుత్వ భూములను  కేటాయించడంలో అధికారులు ప్రజాప్రతినిధులు అక్రమాలకు పాల్పడ్డారని సమగ్ర విచారణ చేసి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభు లింగం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ ఏఐకేఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సుధాకర్ గౌడ్ మండల కార్యదర్శి సత్తిరెడ్డి మండల సహాయ కార్యదర్శి ఎం డి మక్బుల్ బి కే ఎం యు మండల కార్యదర్శి మల్లేష్ మండల మహిళా సంఘం అధ్యక్షురాలు మంజుల తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు