5వ డివిజన్ లో 2,3 రోడ్లను అభివృద్ధి పనులు

Published: Monday May 24, 2021
బాలపూర్, మే 23, ప్రజాపాలన ప్రతినిధి : విపత్కర పరిస్థితుల్లో కూడా అభివృద్ధి పనులు చేపట్టిన కార్పొరేటర్. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ కార్పొరేటర్ బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నాడు వినాయక హిల్స్ రోడ్ నెంబర్ 2, 3 రోడ్లను అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ భర్త బోయపల్లి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ... డివిజన్లో దిశల వారీగా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇంద్రా రెడ్డి గారి సహకారాలు ఎల్లవేళలా ఉన్నప్పుడు అభివృద్ధి పనులు సురక్షితంగా జరుగుతాయని అన్నారు. ప్రతిపక్షాల వారు ప్రజలను ఎన్నో విధాలుగా చెప్పే మాటలకు మోసపోకుండా, నిలకడగా తెలిసేది శాశ్వతంగా నిలబడుతుందని అన్నారు. కాలనీ వాసులందరూ స్థానిక కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.