స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్

Published: Monday August 22, 2022

బోనకల్: మండలంలో పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎంపీడీవో బోడిపుడి వేణుమాధవ్ సూచించారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలో కలకోట, చిరునోమల, పెద్ద బీరవల్లి, జానకిపురం, బోనకల్ గ్రామాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ  మొక్కల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మొక్కలు నాటే ప్రోగ్రాంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేయాలని ఆదేశించారు. స్వాతంత్ర్య ఉద్యమస్ఫూర్తితో  మండలంలోని అన్ని గ్రామాలలో మొక్కలు నాటాలని ఎంపీడీవో సూచించారు. అదేవిధంగా ఆళ్ళపాడు గ్రామంలో డెంగ్యూ కేసు నిర్ధారణ అయిన ఇంటిని సందర్శించి పారిశుద్ధ చర్యలు చేపట్టాలని, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డెంగ్యూ మలేరియా బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామంలో నిరంతర ఇంటింటి జ్వర సర్వే కార్యక్రమం నిర్వహించాలని ఎంపీడీవో వేణుమాధవ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, కో ఆప్షన్ సభ్యులు షేక్ జమాలుద్దీన్, ఏపీఓ కృష్ణకుమారి, ఎంపీ ఓ సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆయా గ్రామాల సర్పంచులు భూక్యా సైదా నాయక్, చిలక వెంకటేశ్వర్లు, ములకారపు రవి, యంగల దయామని, ఆళ్ళ పాడు సర్పంచ్ మర్రి తిరుపతిరావు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.