అత్యాచారం కేసులో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష

Published: Thursday August 25, 2022
బెల్లంపల్లి,  ఆగస్టు 24 , ప్రజా పాలన ప్రతినిధి: 
మంచిర్యాల జిల్లా  బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఇంక్లైన్ రడగంబాల బస్తీ కి చెందిన కాదాసి ఉదయ్ కుమార్  అదే బస్తి కి చెందిన   వివాహితను  అత్యాచారం చేసిన కేసులో నిందితుడు కాదాసి  ఉదయ్ కుమార్ ఆటో డ్రైవర్ కు జిల్లా  ఒకటవ అదనపు సెషన్స్ జడ్జ్ శ్రీమతి జే, మైత్రేయి, 10 సంవత్సరాల జైలు శిక్ష, 5వేల రూపాయల జరిమానా విధించినట్లు బెల్లంపల్లి టూ టౌన్ పోలీసులు బుధవారం తెలిపారు.
వివరాల్లోకి వెళితే్...
2020 సంవత్సరంలో  బెల్లంపల్లి ఇంక్లైన్  రడగంబాల బస్తీకి చెందిన వివాహితని, మర్డర్ కేసులో నిందితునిగా  ఉన్న ఆమె భర్త కి బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి తీసుకెళ్లి   అత్యాచారం చేసాడని, బాధితురాలు  ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ కే, భాస్కర్,  కేసు నమోదు చేసుకుని, సిఐ కె, జగదీష్, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి సాక్షాలను  సేకరించి  ఛార్జ్ షీట్ దాఖలు చేయగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్: పులి రాజమల్లు, లైసన్  పి.మరియన్ రాజు, హెచ్‌సి గులాం దస్తగిర్,  బెల్లంపల్లి 2 టౌన్ కోర్టు డ్యూటీ ఆఫీసర్ రహీమ్ లు గౌరవ కోర్టు ముందు సరైన  సాక్షాధారాలను,  
 సాక్షులను, 1వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి గారి ముందు హాజరుపరచగా  ఛార్జ్ షీట్ మరియు సాక్షుల సాక్షాదారులను  పరిగణలకు తీసుకొని నిందితుడు  ఉదయ్ కుమార్ కు 10 సంవత్సరాల జైలు శిక్ష ,5000 రూపాయల జరిమాన విధించినట్లు  తెలిపారు.