*స్త్రీ ల అభ్యుదయానికి బీజం వేసిన మొదటి తల్లి అమ్మ సావిత్రీ భాయి పూలే ....... అద్యక్షుడు వధిగల్ల బ

Published: Wednesday January 04, 2023

అనాదిగా వంటింటి కుందేలుగా ఎటువంటి హక్కులు లేని మహిళలకి విద్యతో బీజం వేసి వాళ్ళ చేతికి పుస్తకాన్ని అందించి నేడు మహిళల రాజకీయ నాయకులు గా ,వివిధ రంగాలలో ఉద్యోగులు గా గౌరవించ డానికి ముఖ్య కారణం నాడు తల్లి సావిత్రి భాయ్ పూలే గారని,తాను ఈ దేశంలో అన్ని వర్గాల మహిళలకు చదువు నేర్పిన మొదటి గురువు అని వదిగాల్ల బాబు అన్నారు...
తుర్కయంజల్ కూడలిలో మున్సిపాలిటీ కమిటీ అధ్వర్యంలో సావిత్రి భాయ్ పూలే గారి 192 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.... ఈ కార్యక్రమంలో ఉప అధ్యక్షులు మాట్లాడుతూ నేటి పాలకులు కుట్ర పూరితంగా మహనీయుల చరిత్రను మరుగున పడేస్తున్నారు అని అహ్ చరిత్ర ని బావి తరాలకు తెలియ చేస్తూ...తల్లి సావిత్రి భాయి పూలే కలలు కన్న స్త్రీ లకు అన్ని రంగాలలో సమన హక్కులు కల్పించడం బీఎస్పీ పార్టీ లక్ష్యం అని,రానున్న ఎన్నికల్లో పురుషులతో సమానంగా స్త్రీ లకు సీట్ లు కేటాయించనున్నట్లు తమ అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్  ఇప్పటికే ప్రకటించారని అన్నారు.ఇప్పటి వరకు అధికారం అనుభవించిన పార్టీలు స్త్రీ కేటాయించి సీట్లు చాలా తక్కువే అని,దాదాపు కోటి మంది బీసీ మహిళలు వున్న తెలంగాణా రాష్ట్రంలో ఒక్క మహిళ బీసీ ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ  గానీ లేకపోవడం ఈ పాలకులకు స్త్రీ వికాసం పట్ల వున్న చిత్తశుద్ధి నీ తెలియ చేస్తుదని,కేవలం బీఎస్పీ పార్టీ తో మాత్రమే స్త్రీ సంపూర్ణ వికాసం సాధ్యం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యడవల్లి శ్యామ్ , కోశాధికారి పట్నం రమేష్ కురుమ , కార్యదర్శులు భూతం రమణ , జంతుక సైదులు ,కమ్మగుడ సెక్టార్ అధ్యక్షులు లపంగి రాజు  ,10వార్డ్ అధ్యక్షులు మేతరి శ్రీకాంత్ ,వార్డ్ నాయకులు శ్రీనివాస్  మరియు శివ గణేశ్ గారు,ప్రభాకర్ , మున్సిపాలిటీ ప్రజలు,మహిళలు పాల్గొన్నారు,